Happy mother’s Day wishes in Telugu

0
224

Happy mother’s Day Quotes in Telugu

mothers day 2020

 

ఈభూమిమీదఅత్యంతపవిత్రమయిన 
 
అచ్చులలో అందమైనది అమ్మ
అనురాగాన్ని పంచేది…అమ్మ..
ఆత్మాభిమానం కలది…అమ్మ..
ఇష్టమైన పలుకు…అమ్మ…
ఈర్ష్య లేనిది అమ్మ…
ఉన్నతమైనది…అమ్మ
ఊరట నింపేది…అమ్మ..

ఎన్నడూ విడిపోని బంధం…అమ్మ…
ఏ కల్మషం లేనిది.. అమ్మ…
ఐకమత్యం నేర్పేది…అమ్మ..
ఋణానుబంధం…అమ్మ..
ఒక్కమాటపై నిల్చుట నేర్పింది…అమ్మ…
ఔచిత్యం చూపింది…అమ్మ…
అందరినీ ఆదరించేది.. అమ్మ…
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..!


అమ్మ…రెండు అక్షరాల పదం,
ప్రపంచానికి నిజమైన ప్రేమని పరిచయం
చేసే ఒక రూపం,నిన్ను జన్మించడం కోసం
తన మరణం వరకు వెళ్లి పునర్జన్మనిచ్చే దైవం
అమ్మ అనే పదానికి అర్ధం చెప్పడానికి
మనం నేర్చుకున్న ఈ పదాలు సరిపోవు..
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..

అమ్మంటే తెలపడానికి భాష చాలడం లేదు
కానీ చెప్పాలన్న ఆశ ఆగడం లేదు,
నాకు మరో జన్మంటూ ఉంటే…
నీకు అమ్మగా పుట్టాలనుంది అమ్మా…
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

పదాలు తెలియని పెదవులకు
అమృత వాక్యం అమ్మ….
అమ్మ చల్లని ఒడిలో మొదలైంది
ఈ జన్మ….
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

ఈ లోకంలో నువ్వు  ద్వేషించినా కూడా
నిన్ను ప్రేమించేవారు ఉన్నారు అంటే
అది కేవలం అమ్మ మాత్రమే
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

పదాలు తెలియని పెదవులకు
అమృత వాక్యం అమ్మ…
అమ్మ చల్లని ఒడిలో మొదలైంది
ఈ జన్మ…
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

కనిపించే దైవం..
కని పెంచే మాతృమూర్తి
ప్రేమల్లో గొప్పది…
త్యాగశీలి, వాడని మరుమల్లి
ఎన్నో బంధాల కలబోత అమ్మ
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

అమ్మ….
ఈ ప్రపంచంలో
మనల్ని చూడకముందే
ప్రేమించే ఒకే ఒక స్త్రీ…అమ్మ
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..

పదిమందిలో ఒక్కరు.
వందలో ఒక్కరు, కోట్లలో ఒక్కరు.
నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు అమ్మ …
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు…

అమ్మ
నా రేపటి భవిష్యత్ కోసం
నిత్యం శ్రమించే…
శ్రామికురాలు
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ…!

అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే
అమ్మ గురించి ఎంత చేసినా స్వల్పమే
అమ్మను ఎంత తలచినా మధురమే
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

జన్మ జన్మల పుణ్యము వలన
నీ కడుపున పుట్టాను.
మళ్లీ జన్మలు ఎన్నున్నా
నా తల్లివి నీవే అంటాను…
కలలోనైనా
మెళకువలోనైనా
నీ దీవెనలే కోరుకుంటాను..
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

బిడ్డ పలికే
కొత్త కొత్త మాటలకు
అర్థాలు కూర్చే నిఘంటువే!!అమ్మ
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

అన్నం కలిపి గోరుముద్దలు పెట్టేటపుడు
తన బిడ్డపై ఉన్న ప్రేమ కూడా కలిపి
పెడుతుంది.ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా
తింటూ ఉంటే బిడ్డ కడుపు
నిండుతుందో లేదో
తెలియదు కానీ ఆ తల్లి కడుపు
ఆనందంతో నిండిపోతుంది…
అదే అమ్మ…తల్లి ప్రేమ
 మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here